నా ఆఖరి లేఖ
మునిగిందెప్పుడో వదలని వ్యధలకు నా జీవితమే అని తెలిసి మళ్ళీ ముంచి ఆడవెందుకు నడిసంద్రంలోనే ? నీ ప్రేమ ఎవరికీ పంచాలని , నా ప్రేమని భరించలేనన్నావ్ ? అహాన్ని అందలమెక్కించి , మునుపటి స్నేహం కోల్పోయావే అన్ని వదిలి వెళ్ళిపోయా , తిరిగి రమ్మన్నది నువ్వు కాదా ? చేరాక , చేయ్యివకపోగా , చీకట్లోకి నెట్టి నీపై ప్రేమ చంపుకోలేక , ఏ తప్పయినా నా తప్పనుకున్నా ప్రేమే , ఒక తప్పని , చెప్పకనే తెలిసేలా చేసావ్ ఆపుతావనే ఆశతో , గుడ్ బాయ్ చెప్తే , గుడ్ నైట్ చెప్పి నను ఒంటరిగానే వదిలి , నిద్ర పోయావు లైట్ ఆపి నిన్నే మరచిపోలేక , ...